లాక్‌డౌన్‌ సడలింపుల విషయంలో గందరగోళం ఎందుకు? మమత

April 27, 2020


img

కరోనా వ్యాప్తిని అడ్డుకొనేందుకు కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటిస్తే కాస్త అటూ ఇటూగా అన్ని రాష్ట్రాలు పాటిస్తూనే ఉన్నాయి. కానీ లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపుల విషయంలోనే కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల మద్య భిన్నాభిప్రాయాలు వ్యతమ్ అవుతున్నాయి. 

ఓ పక్క లాక్‌డౌన్‌ ఖచ్చితంగా పాటించాలని చెపుతూనే, రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించకుండా కేంద్రప్రభుత్వం కొన్ని రంగాలకు ఆంక్షలు సడలిస్తుండటాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తప్పు పట్టారు. లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలిస్తే తమకు ఎటువంటి అభ్యంతరమూ లేదు కానీ ముందుగా రాష్ట్రాలను సంప్రదించి వాటి సలహాలు, సూచనలను బట్టి లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలిస్తే బాగుంటుందని మమతా బెనర్జీ అన్నారు. ఎందుకంటే ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన పరిస్థితులు నెలకొని ఉంటాయి కనుక ఏ ఏ రంగాలకు ఏ మేరకు లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించాలో కేంద్రప్రభుత్వం కంటే రాష్ట్ర ప్రభుత్వాలకే ఎక్కువ అవగాహన ఉంటుంది కనుక సడలింపుల విషయంలో రాష్ట్రాలను సంప్రదించాలనే మమతా బెనర్జీ సూచన మంచిదేనని చెప్పవచ్చు. అయితే రాష్ట్రాలు దేనికది యాదేచ్చగా ఆంక్షలు సడలించేందుకు అనుమతించినా మళ్ళీ కరోనా మహమ్మారి దేశమంతా కమ్ముకొనే ప్రమాదం ఉంటుంది కనుక ఆంక్షల సడలింపౌ విషయంలో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి సమన్వయంతో ముందుకు సాగవలసి ఉంటుంది. 



Related Post