ఏపీలో కరోనా విజృంభణ కొత్తగా 80 కేసులు

April 27, 2020


img

తెలంగాణ రాష్ట్రంలో కరోనా దాదాపు నియంత్రణలోకి వస్తుంటే పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి నానాటికీ విజృంభిస్తోంది. నిన్న ఒక్కరోజే కొత్తగా 80 పాజిటివ్ కేసులు నమోదవడంతో ఏపీలో కరోనా కేసుల సంఖ్య 1,177కి చేరింది. 

తెలంగాణలో 1,001 కేసులు నమోదు కాగా వారిలో 316 మంది కోలుకొన్నారు. ఏపీలో 1,177 నమోదు కాగా 235 మంది కోలుకొన్నారు. తెలంగాణలో 25మంది మృతి చెందగా ఏపీలో 31 మంది మృతి చెందారు. 

నిజానికి నెలరోజులకు పైగా సాగుతున్న లాక్‌డౌన్‌తో తెలంగాణ రాష్ట్రంలోలాగ ఏపీలో కూడా కరోనా వైరస్ నియంత్రణలోకి వచ్చి ఉండాలి. కానీ అందుకు భిన్నంగా లాక్‌డౌన్‌ గడువు దగ్గర పడుతున్నకొద్దీ ఏపీలో కరోనా కేసులు శరవేగంగా పెరిగిపోతున్నాయి. ఏపీలో కరోనా కేసులు పెరుగుతుండటంతో పొరుగు రాష్ట్రమైన తమిళనాడు అప్రమత్తమైంది. ఏపీ-తమిళనాడు సరిహద్దులలో రోడ్లకు అడ్డంగా గోడలు నిర్మింపజేస్తోంది. తిరుత్తణి వెళ్ళే మార్గంలో శెట్టిoతంగాల్ వద్ద మరో రెండు సరిహద్దు ప్రాంతాలలో రోడ్లకు అడ్డంగా గోడలు నిర్మింపజేస్తోంది. తమిళనాడులో ఏపీకంటే అధికంగా 1,885 కేసులు నమోదైనప్పటికీ, ఏపీ నుంచి తమ రాష్ట్రానికి కరోనా వ్యాపించకుండా జాగ్రత్తపడుతుండటం విశేషం.   

      

ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన తాజా హెల్త్ బులెటిన్ ప్రకారం 13 జిల్లాలో కరోనా కేసుల సంఖ్య ఈవిధంగా ఉంది: 

జిల్లా

కొత్త కేసులు

పాజిటివ్

22/4

పాజిటివ్

  23/4

పాజిటివ్

  24/4

పాజిటివ్

  25/4

పాజిటివ్

  27/4

డిశ్చార్జ్

 

మృతులు

25/4

శ్రీకాకుళం

0

0

0

0

3

4

0

0

విజయనగరం

0

0

0

0

0

0

0

0

విశాఖ పట్నం

0

21

22

22

22

22

19

0

తూర్పుగోదావరి

0

26

32

34

37

39

12

0

పశ్చిమ గోదావరి

3

39

39

39

39

54

11

0

కృష్ణా

33

86

88

102

127

210

29

8

గుంటూరు

23

177

195

206

209

237

29

8

ప్రకాశం

0

48

50

53

53

56

23

0

కడప

0

51

51

51

55

58

28

0

కర్నూలు

13

203

234

261

275

292

31

9

నెల్లూరు

7

67

67

68

72

79

23

2

చిత్తూరు

0

59

73

73

73

73

16

0

అనంతపురం

0

36

42

46

51

53

14

4

మొత్తం

80

813

893

955

1016

1,177

235

31


Related Post