సౌదీలో కొరడా దెబ్బలుండవు ఇక!

April 25, 2020


img

ప్రపంచదేశాలలో సౌదీ అరేబియాలో చాలా తక్కువ నేరాలు నమోదు అవుతుంటాయి. కారణం అక్కడ చిన్న చిన్న నేరాలకు కూడా చాలా కటినమైన శిక్షలు విధిస్తూండటం...అవి కూడా బహిరంగంగా విధిస్తుందటమే కారణమని చెప్పవచ్చు. నేరం చేస్తే ఏమవుతుందో.. ఎటువంటి శిక్షలు విధిస్తారో... అవి ఏ విధంగా ఉంటాయో ప్రజలకు కళ్ళారా చూపించడం ద్వారా నేరం చేయకూడదనే భయం కల్పించాలానే ఉద్దేశ్యంతోనే  శిక్షలను బహిరంగంగా ప్రజల సమక్షంలో అమలుచేస్తుంటారు. సౌదీ అరేబియాలో చిన్న చిన్న నేరాలకు బహిరంగంగా కొరడా దెబ్బలు విధించడం జరుగుతుంటుంది. అయితే గత కొన్నేళ్ళుగా సౌదీ అరేబియాలో మెల్లగా మార్పులు మొదలయ్యాయి. వాటిలో భాగంగానే ఇకపై నేరస్తులకు కొరడా దెబ్బల శిక్షను రద్దు చేయాలని సౌదీ ప్రభుత్వం నిర్ణయించింది. దానికి బదులు నేరస్తులకు జైలు శిక్ష, జరిమానాలు విధించాలని నిర్ణయించింది. సౌదీ రాజు సల్మాన్ బిన్ అబ్దులజీజ్ అల్ సౌద్   సల్మాన్ ఆదేశాల ప్రకారం ఈమేరకు ఆ శిక్షలను రద్దు చేస్తున్నట్లు సౌదీ సుప్రీం కోర్టు జనరల్ కమీషన్ ప్రకటించింది. 



Related Post