కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాక్

April 23, 2020


img

కరోనా...లాక్‌డౌన్‌ కారణంగా దేశ ఆర్ధిక పరిస్థితి క్షీణిస్తుండటంతో కేంద్రప్రభుత్వం ఈరోజు మరో కీలక నిర్ణయం తీసుకొంది. వచ్చే ఏడాది జూలై వరకు కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, డీఆర్ పెంచకూడదని నిర్ణయించింది. అలాగే ఈ ఏడాది జనవరి 1 నుంచి ఇప్పటివరకు కేంద్రప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లించవలసిన అదనపు డీఏ, డీఆర్‌లను కూడా జులై 2021 వరకు చెల్లించకుండా నిలిపివేయాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. అయితే ప్రస్తుతం ఉన్న డీఏ, డీఆర్‌లను మాత్రం యధాతధంగా చెల్లించబడుతుంది. సుమారు 50 లక్షల మంది ఉద్యోగులు, 61 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. పెంచిన డీఏ, డీర్‌ చెల్లింపులను నిలిపివేయడం మిగిలే సొమ్మును కేంద్రప్రభుత్వం వేరే అత్యవసర కార్యక్రమాలకు వినియోగించుకొంటుంది.         



Related Post