ఆ ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ఆమోదముద్ర

April 23, 2020


img

కరోనా రోగులకు చికిత్సనందిస్తున్న వైద్యులపై, ఆసుపత్రి సిబ్బందిపై దాడులు చేస్తున్నవారిని కటినంగా శిక్షించేందుకు కేంద్రప్రభుత్వం జారీ చేసిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ బుదవారం ఆమోదముద్ర వేశారు. కనుక అది చట్టరూపంలో వెంటనే అమలులోకి వచ్చింది. దాని ప్రకారం ఇక నుంచి వైద్యులు, వైద్య సిబ్బందిపై దాడులు చేసినవారికి నాన్ బెయిలబుల్ అరెస్ట్ చేయబడతారు. వారికి 3 నెలల నుంచి 5 సం.లు వరకు జైలు శిక్ష విధించబడుతుంది. జైలు శిక్షతో పాటు రూ.5,000 నుంచి రూ.2 లక్షలు జరిమానా కూడా విధించబడుతుంది.

వైద్యులు, వైద్య సిబ్బందిని తీవ్రంగా గాయపరిచినా, వారికి ఉద్దేశ్యపూర్వకంగా కరోనా వ్యాపింపజేయాలని ప్రయత్నించినా ఆరు నెలల నుంచి ఏడేళ్ళ వరకు జైలు శిక్ష విధించబడుతుంది. దానితో పాటు జరిమానా కూడా విధించబడుతుంది. ఈ కేసులపై విచారణ 30 రోజులలోగా పూర్తిచేసి శిక్షలు ఖరారు చేయబడతాయి. రోగులు, వారి బందువులు ఎవరైనా ఆసుపత్రులపై దాడులు చేసి ఆస్తినష్టం కలిగించినట్లయితే, మార్కెట్ విలువకు రెట్టింపు వసూలు చేయబడుతుంది. కరోనా రోగులకు, క్వారంటైన్‌లో ఉన్నవారికి సేవలు అందిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది, ఆశావర్కర్లకు ఒక్కొక్కరికీ రూ.50 లక్షల జీవితభీమా కల్పించబడుతుంది. 


Related Post