ముంబైలోనే 2,455 కేసులు నమోదు

April 21, 2020


img

దేశంలో అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్న రాష్ట్రం మహారాష్ట్ర. ఆ రాష్ట్రంలో నమోదు అవుతున్న కేసులలో అత్యధికంగా రాజధాని ముంబైలోనే నమోదు అవుతుండటం విశేషం. మహారాష్ట్రలో నేడు కొత్తగా 283 కేసులు నమోదుకావడంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2,455కి చేరింది. ముంబై తరువాత స్థానంలో నిలిచిన పూణేలో 591, ఆ తరువాత స్థానాలలో వరుసగా థానే: 362, పాల్గర్: 83, నాగపూర్:60, నాసిక్:53 కేసులు అయ్యాయి. మహారాష్ట్రలో తెలంగాణ సరిహద్దు జిల్లా అయిన ఉస్మానాబాద్: 3 కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. జల్న, చంద్రపూర్ జిల్లాలో చెరో రెండు కేసులు, వాషిం, సింధుదుర్గ్, పర్భాని, నండూర్‌బర్, హింగోలీ, గోండియా, ధూలే, బిద్ జిల్లాలలో కేవలం ఒక్కో కేసు చొప్పున నమోదు అయ్యాయి. మహారాష్ట్రలో కరోనా కేసులు 4,666కి చేరుకోవడంతో మృతుల సంఖ్య  అదే స్థాయిలో పెరుగుతోంది. ఇప్పటివరకు 232 మంది కరోనాకు బలయ్యారు. మరణించినవారిలో 187 మంది ముంబైకి చెందినవారే కావడం గమనిస్తే 15 లక్షలకు పైగా జనాభా నివాసం ఉంటున్న ధారావీ మురికివాడలో కరోనా విధ్వంసం మొదలైనట్లే కనిపిస్తోంది.



Related Post