తెలంగాణకు వర్ష సూచన

April 17, 2020


img

ఉపరితల ద్రోణి కారణంగా తెలంగాణ రాష్ట్రంలో రాగాల మూడు రోజులలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలియజేశారు. ముఖ్యంగా హైదరాబాద్‌తో సహా మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి,  వికారాబాద్, నిజామాబాద్‌, నిర్మల్, మహబూబ్‌నగర్‌, కరీంనగర్‌, జగిత్యాల, పెద్దపల్లి, ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్లా జిల్లాలలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.      

కనుక పంటలు కోసి ఆరబెట్టుకొన్నవారు, మార్కెట్ యార్డులకు పంటలను తెస్తున్న రైతులు చేతికి అందివచ్చిన తమ పంటను వర్షంలో తడిసిపోకుండా అవసరమైన ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అలాగే వర్షం కారణంగా వాతావరణం చల్లబడితే కరోనా వైరస్‌ త్వరగా వ్యాపించే ప్రమాదం ఉంటుంది కనుక వీలైనంతవరకు ప్రజలు ఇళ్లలోనే ఉండటం మంచిది.     



Related Post