లాక్‌డౌన్‌పై కేంద్రప్రభుత్వం తాజా మార్గదర్శకాలు

April 15, 2020


img

దేశంలో కొన్ని రంగాలకు ఏప్రిల్ 20వ తేదీ నుంచి లాక్‌డౌన్‌ నుంచి పరిమిత మినహాయింపులు ఇస్తామని ప్రధాని నరేంద్రమోడీ చెప్పినట్లుగానే కేంద్రప్రభుత్వం ఈరోజు తాజా మార్గదర్శకాలు ప్రకటించింది. 

లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు పొందేవి: 

1. వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, క్రయ విక్రయాలకు, మార్కెట్ యార్డులు  

2. వ్యవసాయ యంత్ర పరికరాలను అద్దెకు ఇచ్చే సంస్థలు  

3. విత్తనోత్పత్తి, ఎరువులు, పురుగుల మందుల దుకాణాలు  

4. గోదాములు, శీతల గోదాములు  

5. ఉపాధి హామీ పనులకు అనుమతి. 

6. గ్రామీణ ప్రాంతాలలో సాగునీరు, రోడ్లు, పరిశ్రమలు 

7. పాలు, కాఫీ, టీ, పౌల్ట్రీ, రబ్బరు రంగాలు  

8. ఆక్వా ఉత్పత్తుల క్రయవిక్రయాలకు అనుమతి 

9. బ్యాంకుల కార్యకలాపాలకు అనుమతి.

10. ఆన్‌లైన్‌లో వ్యాపార కార్యకలాపాలు సాగించే ఈ కామర్స్ సంస్థలు, వాటి వాహనాలకు అనుమతి. 

11. రోడ్ల పక్క దాబాలు, వాహనాల మరమత్తులు చేసేవారు. 

12. ఎలక్ట్రీషియన్, మోటార్ మెకానిక్, ప్లంబర్, కార్పెంటర్, పెయింటర్ తదితరులు.

13. అనాధ శరణాలయాలు, వృద్దాశ్రమలు, దివ్యాంగుల శరణాలయాలు 

14. ఆసుపత్రులు, ఆరోగ్య పరీక్షా కేంద్రాలు, మందుల దుకాణాలు, వైద్య పరిశోధనా కేంద్రాలు 

అనుమతి లేనివి: 

1. బస్సులు, రైళ్లు, విమానసేవలు 

2. సినిమా హళ్ళు, షాపింగ్ మాల్స్, క్రీడా ప్రాంగణాలు, వ్యాయామశాలలు

3. సామూహిక మత ప్రార్ధనలు

4. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస కార్మికుల తరలింపు

5. విద్యాసంస్థలు, శిక్షణా కేంద్రాలు        

షరతులతో కూడిన అనుమతులు:

1. 50 శాతం సిబ్బందితో ఐ‌టి కంపెనీ కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు. 

2. భవన నిర్మాణరంగానికి షరతులతో కూడిన అనుమతులు 

3. పెళ్ళిళ్ళు, శుభకార్యక్రమాలకు కలక్టర్ అనుమతి తప్పనిసరి.

4. అంత్యక్రియలకు 20 మందికి మాత్రమే అనుమతి 

5. కేవలం వైద్య సేవలు పొందేందుకు ఇతర ప్రాంతాలకు వెళ్ళేందుకు అనుమతి

లాక్‌డౌన్‌ ఆంక్షలు: 

1. బహిరంగ ప్రదేశాలలో ఉమ్మివేయడం నేరం 

2. విధిగా అందరూ మాస్కూలు ధరించాలి. 

3. హాట్ స్పాట్ ప్రాంతాలలో నిత్యావసర వస్తువులు, మందులు వంటివి తప్ప మరి వేటినీ అనుమతించరు. 

హాట్ స్పాట్ ప్రాంతాలకు సంబందించి కేంద్రప్రభుత్వం మళ్ళీ వేరేగా మార్గదర్శకాలు త్వరలోనే ప్రకటిస్తుంది. 


Related Post