మే 3వరకు రైళ్లు, విమానాలు బంద్‌

April 14, 2020


img

దేశంలో మే3వరకు లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోడీ ఈరోజు ఉదయం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే పరిమిత సంఖ్యలో రైళ్లు, విమానాలు నడుస్తాయని అందరూ భావించారు. కానీ కేంద్రప్రభుత్వం నుంచి రైల్వే, విమానయాన సంస్థలకు ఎటువంటి ఆదేశాలు రాకపోవడంతో మే3వరకు అన్ని రైళ్లు, జాతీయ, అంతర్జాతీయ పౌరవిమానసేవలు నిలిపివేయబడతాయి. రైల్వేశాఖ ఇప్పటికే కూడా ఈవిషయం ప్రకటించింది. బియ్యం, గోధుమలు, పప్పులు, నూనెలు, పళ్ళు, కూరగాయలు వంటి నిత్యావసర సరుకుల రవాణా సర్వీసులు మాత్రం యధాప్రకారం కొనసాగుతాయని రైల్వేశాఖ ప్రకటించింది.    

ఈరోజుతో లాక్‌డౌన్‌ ఎత్తేస్తే దేశీయవిమానసేవలు ప్రారంభించేందుకు వీలుగా టికెట్ బుకింగ్స్ చేసిన కొన్ని విమానయాన సంస్థలు ప్రయాణికులకు డబ్బు వాపసు చేయడం లేదా ఆ టికెట్లను లాక్‌డౌన్‌ తరువాత వినియోగించుకొనే అవకాశం కల్పించవచ్చు. 



Related Post