జీహెచ్‌ఎంసీపై ఇక స్పెషల్ ఫోకస్

April 14, 2020


img

హైదరాబాద్‌ నగరంలో ప్రతీరోజు కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో సిఎం కేసీఆర్‌ సోమవారం ప్రగతి భవన్‌లో వైద్యారోగ్యశాఖమంత్రి ఈటల రాజేందర్‌, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగరావు, ప్రభుత్వ ముఖ్యసలహాదారు రాజీవ్‌శర్మ తదితర ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం కేసీఆర్‌ వారికి కొన్ని ముఖ్య సూచనలు చేశారు. 

జీహెచ్‌ఎంసీ పరిధిలో గల 30 సర్కిళ్ళను 17 యూనిట్లుగా విభజించి, ఒక్కో యూనిట్‌కు వైద్య, పోలీస్, రెవెన్యూ, మునిసిపల్ శాఖల నుంచి ఒక్కో ఉన్నతాధికారిని నియమించాలి. 

ప్రతీరోజు వైద్యఆరోగ్య, మునిసిపల్ శాఖల మంత్రులు ప్రగతి భవన్‌లో సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితులను అంచనావేసుకొంటూ తదనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకొని ముందుకు సాగాలి. 

రాష్ట్రంలో..నగరంలో కంటయిన్మెంట్ ఏరియాలుగా గుర్తించిన ప్రాంతాలలో మరింత ఖచ్చితంగా లాక్‌డౌన్‌ ఆంక్షలను అమలుచేయాలి.


Related Post