వలస కార్మికుల కోసం కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు

April 13, 2020


img

మార్చి 24 నుంచి దేశమంతటా లాక్‌డౌన్‌ ప్రకటించినప్పుడు దేశవ్యాప్తంగా వివిద రాష్ట్రాల నుంచి వచ్చి ఇతర రాష్ట్రాలలో పనిచేస్తున్న లక్షలాదిమంది వలసకార్మికులు ఉపాది, ఆదాయం కోల్పోవడంతో తమ స్వస్థలాలకు బయలుదేరారు. లాక్‌డౌన్‌ కారణంగా వాహనాలు లేకపోవడంతో చాలా మంది కాలినడకన భార్యాపిల్లలను వెంటబెట్టుకొని వందల కిలోమీటర్లు నడిచారు. లాక్‌డౌన్‌ కారణంగా దారిలో వారికి నీళ్ళు, ఆహారం లభించక ప్రతీచోట అవమానాలు, తిరస్కారాలు ఎదుర్కొంటూ..నానా అవస్థలు పడ్డారు. ఇంకా పడుతూనే ఉన్నారు. వలస కార్మికులు, వారి కుటుంబాలు ఎదుర్కొంటున్న కష్టాలను చూసి ప్రతిపక్షాలు, పౌరసంఘాలు కేంద్రప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించాయి. ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు, ఏర్పాట్లు చేయకుండా హటాత్తుగా లాక్‌డౌన్‌ ప్రకటించి వలసకార్మికులను రోడ్డున పడేశారని, వారి ప్రాణాలతో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు చెలగాటం ఆడుతున్నాయని ప్రతిపక్షాలు విమర్శించాయి. 

ఈ నేపధ్యంలో మళ్ళీ మరో రెండువారాలు లాక్‌డౌన్‌ పొడిగించేందుకు సిద్దమవుతున్న కేంద్రప్రభుత్వం, ఈసారి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో వలసకార్మికుల సహాయం కోసం కంట్రోల్ రూములు ఏర్పాటు చేసి ప్రాంతీయ కార్మికశాఖ కమీషనర్, ఆయనకు సహాయంగా ఇద్దరు కమీషనర్లను నోడల్ అధికారులుగా నియమించింది. హైదరాబాద్‌ రీజియన్‌లో ఏర్పాటు చేసిన ఈ కంట్రోల్ రూమ్‌కు ఫోన్‌, వాట్సాప్‌, మెసేజ్, లేదా ఈ మెయిల్ ద్వారా వలస కార్మికులు సహాయం కోరవచ్చు.

అధికారి పేరు

ఫోన్‌/ వాట్సాప్‌ నెంబరు

ఈ మెయిల్

విటి థామస్

9496204401

richyd@nic.in/dyclchyd-ap@nic.in

పి లక్ష్మణ్

8328504888

alchydpl@gmail.com

ఏ చతుర్వేది

8552008109

Alc2.hyd-mole@gov.in           


Related Post