తెలంగాణలో ఏప్రిల్ 30వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు

April 12, 2020


img

ముఖ్యమంత్రి ప్రగతి భవన్‌లో శనివారం సాయంత్రం ప్రెస్‌మీట్‌లో ఏప్రిల్ 30వరకు రాష్ట్రంలో లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ఆ తరువాత పరిస్థితులను బట్టి దశలవారీగా లాక్‌డౌన్‌ ఎత్తివేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. రాష్ట్రంలో 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్ధులందరినీ పైతరగతులకు ప్రమోట్ చేస్తున్నాము. 10వ తరగతి పరీక్షలు ఎప్పుడు ఏవిధంగా నిర్వహించాలనేది చర్చించి నిర్ణయం తీసుకొంటాము. కనుక విద్యార్దులు వారి తల్లితండ్రులు ఆందోళన చెందనవసరం లేదు.  

రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు కింద విస్తారంగా పంటలు పండించారు. కనుక చివరిదశలో ఉన్న పంటలకు నీళ్ళు అందిస్తాము. కోతలకు సహకరిస్తాము. ప్రస్తుతం రబీ సీజనులో దేశవ్యాప్తంగా వివిదరకాల పంటలు కోతలు ప్రారంభం అయ్యాయి. కనుక ఆ పనులు పూర్తిచేసేందుకు లాక్‌డౌన్‌ నుంచి రైతులకు మినహాయింపు ఇవ్వాలని ప్రధాని నరేంద్రమోడీకి విజ్ఞప్తి చేశానని సిఎం కేసీఆర్‌ చెప్పారు. 



Related Post