కరోనాను అడ్డుకొనేందుకు ఇదే చివరి అవకాశం?

March 31, 2020


img

సోమవారం ఉదయం 10.30 గంటలకు మనదేశంలో మొత్తం 1,071 కేసులు, 29 మంది మృతి చెందగా 24 గంటల వ్యవధిలో దేశంలో కొత్తగా 180 కేసులు నమోదు అయ్యాయి. దాంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,251కి, మృతుల సంఖ్య 32కి చేరింది. 

డిల్లీ, నిజాముద్దీన్ మత సదస్సులో పాల్గొని వివిదరాష్ట్రాలకు తిరిగివచ్చిన వారిద్వారా దేశమంతటా కరోనా వ్యాపించే ప్రమాదం ఉంది కనుక వారి కోసం రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున గాలిస్తున్నాయి. వారు తమ స్వస్థలాలకు తిరిగి వచ్చిన తరువాత వారు ఎంతమందిని కలిశారో వారిని కూడా గుర్తించవలసి ఉంది. వారినందరినీ గుర్తించడం, వారికి వైద్యపరీక్షలు నిర్వహించడం చాలా కష్టమే. పోలీసులు, వైద్యబృందాలు వారీనందరినీ గుర్తించి క్వారంటైన్‌కు  తరలించేవరకు దేశంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉంటాయి. 

ఇక లాక్‌డౌన్‌ కారణంగా ఉద్యోగాలు, ఉపాది కోల్పోయిన వేలాదిమంది కార్మికులు తమ కుటుంబాలతో కలిసి వందల కిలోమీటర్లు కాలినడకన తమ స్వగ్రామాలకు వెళుతున్నారు. వారిలో ప్రతీ ముగ్గిరిలో ఒకరి ద్వారా కరోనా వ్యాపించే ప్రమాదం ఉందని కేంద్రప్రభుత్వమే సుప్రీంకోర్టుకు తెలియజేసింది. కానీ వారందరికీ క్వారంటైన్‌ శిబిరాలలోకి తరలించడం లేదు. కనుక రానున్న రోజులలో దేశంలో కరోనా వైరస్ మరింత వేగంగా వ్యాపించే ప్రమాదం ఉంది.  

దేశంలో కాలినడకన రోడ్లపై సాగిపోతున్నవారిని ఎక్కడిక్కడ నిలిపివేసి వారికి నీళ్ళు, ఆహారం అందించి వైద్య పరీక్షలు నిర్వహించవలసిన అవసరం ఉంది. ఇక నుంచి లాక్‌డౌన్‌ మరింత కటినంగా అమలుచేయతప్పదు. దేశంలో కరోనాను అడ్డుకొనేందుకు ఇదే చివరి అవకాశమని భావించవచ్చు. అప్పుడే దేశంలో కరోనా మహమ్మారిని అదుపు తప్పకుండా నియంత్రించగలము.


Related Post