కరోనాపై యుద్ధానికి టాటా ట్రస్ట్ రూ.500 కోట్లు

March 28, 2020


img

భారతదేశంలో టాటా సంస్థలకు ఓ ప్రత్యేక గౌరవం ఉందనే సంగతి అందరికీ తెలుసు. దశాబ్ధాలుగా వివిద పరిశ్రమలు విజయవంతంగా నడిపిస్తూ వేలాదిమందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు, పరోక్షంగా ఉపాది అవకాశాలు కల్పిస్తుండటమే కాక దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తుంటాయి టాటా సంస్థలు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే టాటా సంస్థలు పెద ఎత్తున నిర్వహించే సామాజిక సేవా కార్యక్రమాలన్నీ మరో ఎత్తు. దేశానికి సంపద సృష్టించడమేకాకుండా ఆ సంపదను తిరిగి సమాజ శ్రేయస్సుకు వినియోగిస్తుంటాయి టాటా సంస్థలు. అందుకే టాటాలపట్ల...వారి సంస్థల పట్ల దేశ ప్రజలలో ప్రత్యేక గౌరవం కనబడుతుంది. 

కరోనా మహమ్మారి భారత్‌ను కమ్ముకొంటున్న ఈ తరుణంలో టాటా సంస్థలు మళ్ళీ దేశానికి సేవ చేయడానికి నడుం బిగించాయి. కరోనాపై పోరాటం కోసం టాటా సంస్థలు ఒకటీ రెండూ కాదు...ఏకంగా రూ.500 కోట్లు కేటాయించాయి. టాటా ట్రాస్ట్స్ ఛైర్మన్ రతన్ టాటా ఒక లేఖ ద్వారా ఈ విషయం ప్రకటించారు. ఈ మొత్తాన్ని ఏవిధంగా ఖర్చు చేయబోతున్నారో కూడా ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. 

1. అందరి కంటే ముందు వరుసలో నిలిచి కరోనాతో పోరాడుతున్న వైద్య సిబ్బందికి అవసరమైన రక్షణ వస్తువులు అంటే ఐసోలేషన్ వార్డులలోకి వెళ్ళేటప్పుడు ధరించే ప్రత్యేక దుస్తులు, మాస్కూలు, గ్లౌసులు వగైరాల కొనుగోలుకు. 

2. కరోనా రోగులకు చికిత్సకు అవసరమైన వెంటిలేటర్లు, ఇతర వైద్య పరికరాల కొనుగోలుకు. 

3. కరోనా టెస్టింగ్ కిట్స్ కొనుగోలుకు

4. కరోనా రోగుల చికిత్స కోసం మొబైల్ లేదా తాత్కాలిక వైద్యశాలల ఏర్పాటుకు

5. కరోనా రోగులకు సేవ చేస్తున్న సిబ్బందికి అవసరమైన శిక్షణ కార్యక్రమాలకు, కరోనాను ఎదుర్కోవడం ప్రజలలో అవగాహన పెంచడానికి ప్రచారానికి ఈ నిధులను వినియోగించబోతున్నట్లు రతన్ ఎన్‌ టాటా పేర్కొన్నారు. 

కరోనాపై పోరాటం గురించి ఆయన ఎమన్నారో ఆయన మాటలలోనే... 

              



Related Post