దేశంలో కరోనా...మధ్యప్రదేశ్‌లో రాజకీయసంక్షోభం

March 20, 2020


img

ఒకవైపు దేశమంతటా కరోనాతో అట్టుడికిపోతుంటే, మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌, బిజెపి నేతలు మాత్రం కరోనాను పట్టించుకోకుండా రాజకీయాలలో చాలా హడావుడిగా ఉన్నారు. అందుకు బలమైన కారణాలే ఉన్నాయి. సుప్రీంకోర్టు ఆదేశానుసారం ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు సిఎం కమల్‌నాథ్ శాసనసభలో బలనిరూపణ చేసుకోవలసి ఉంది. అయితే 22 మంది కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ ఆమోదించడంతో కమల్‌నాథ్ ప్రభుత్వం మెజార్టీ కోల్పోయింది. దాంతో కొద్ది సేపటి క్రితమే కమల్‌నాథ్ తన పదవికి రాజీనామా చేశారు. 

ఈ తాజా రాజీనామాలతో శాసనసభ్యుల సంఖ్య 220 నుంచి 206కు పడిపోయింది. దాంతో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 104 అయ్యింది. రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాల తరువాత శాసనసభలో కాంగ్రెస్ పార్టీ-92, బిజెపి-107 ఎమ్మెల్యేలు ఉన్నారు. మరో నలుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు, బీఎస్పీకి చెందిన ఇద్దరు, ఓ ఎస్పీ ఎమ్మెల్యే కూడా బిజెపికి మద్దతు ఇస్తున్నారు. కనుక రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మార్గం సుగమం అయ్యింది. 



Related Post