పాకిస్థాన్‌లో నిలిచిపోయిన విద్యుత్ సరఫరా

January 11, 2021
img

పాకిస్థాన్‌లోని పలు రాష్ట్రాలలోని పలు నగరాలు మొదలు గ్రామస్థాయి వరకు శనివారం రాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దాంతో దేశవ్యాప్తంగా పాకిస్థాన్‌ అంతటా అంధకారంలో మునిగిపోయింది. పాక్‌లోని అతిప్రధానమైన సింధ్ ప్రావిన్స్‌లోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని పాక్‌ విద్యుత్ శాఖ మంత్రి ఒమర్ ఆయూబ్ ఖాన్ తెలిపారు. ఇప్పటికే పలు నగరాలు, పట్టణాలకు విద్యుత్ పునరుద్దరించామని మిగిలిన ప్రాంతాలకు కూడా త్వరలోనేవిద్యుత్ పునరుద్దరిద్దరిస్తామని తెలిపారు. ఇస్లామాబాద్, కరాచీ, లాహోర్, రావల్పిండీ, ముల్తాన్ తదితర నగరాలలో కొన్నిచోట్ల పూర్తిగాను మిగిలిన ప్రాంతాలలో పాక్షికంగా విద్యుత్ సరఫరాను పునరుద్దరించామని తెలిపారు. విద్యుత్ సరఫరా చేసే ట్రాన్స్ మిషన్ లైన్స్ చాలా పాతవైపోవడంతో ఈ సమస్య ఏర్పడినట్లు తెలిపారు. 

విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో దానిపైనే ఆధారపడిన పరిశ్రమలు, వ్యాపారసంస్థలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా ఇంటర్నెట్ నిలిచిపోవడంతో బ్యాంకింగ్, రవాణా, తదితర కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 

విద్యుత్ సరఫరా చేసే ట్రాన్స్ మిషన్ లైన్స్ చాలా పాతవైపోవడంతో ఈ సమస్య ఏర్పడినట్లు పాక్‌ విద్యుత్ శాఖ మంత్రి ఒమర్ ఆయూబ్ ఖాన్ చెప్పడం సిగ్గుచేటు. ఎప్పుడూ ప్రగల్భాలు పలుకుతూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించే పాక్‌ పాలకుల అలసత్వానికి ఇదే అతిపెద్ద నిదర్శనం. భారత్‌లో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఇటువంటి పనులు నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంటాయి. ముఖ్యంగా నరేంద్రమోడీ ప్రధానిగా చేపట్టినప్పటి దేశవ్యాప్తంగా రోడ్లు, భారీ వంతెనలు, సొరంగమార్గాలు, విద్యుత్, రైల్వే లైన్లు వంటి నిర్మాణపనులు జోరందుకొన్న సంగతి అందరికీ తెలిసిందే.

Related Post