మా ఇంటి బంగారం సమంత తుపాకీ పట్టుకుందేమిటి?

April 28, 2024


img

సమంత తెలుగు సినీ పరిశ్రమలో ఎంత వేగంగా పైకి ఎదిగిందో అంతే వేగంగా కిందకు పడిపోయింది. నాగ చైతన్యతో విడాకులు.. ఆ బాధతో సినిమాలకు దూరం అవడం, సరిగ్గా అదే సమయంలో అరుదైన వ్యాధి ఆమెను కబళించివేసి శక్తి హీనురాలిగా చేయడం, చేసిన ఒకటి రెండు సినిమాలు ఫ్లాప్ అవడంతో సమంత సినిమాలకు దూరం అయ్యింది. ఈరోజు (ఏప్రిల్‌ 28) ఆమె పుట్టినరోజు. 

కానీ ఆమె ఖుషీ తర్వాత మరో సినిమా మొదలుపెట్టలేదు. కనుక ఎవరూ ఆమె నుంచి సినిమా ప్రకటన చేస్తుందని ఊహించలేదు. కానీ ఈరోజు తన పుట్టిన రోజు సందర్భంగా తాను చేయబోతున్న ‘మా ఇంటి బంగారం’ పోస్టర్ విడుదల చేసింది. 

మెడలో మంగళసూత్రాలు, బ్యాక్ గ్రౌండ్‌లో వంటగది, తుపాకీ పట్టుకొని ఎవరికో గురిపెట్టిన్నట్లు ఫస్ట్-లుక్ పోస్టర్‌లో చూపారు. అయితే ఇది సినిమానా లేక వెబ్‌ సిరీసా?అనేది తెలియకుండా సస్పెన్స్ లో పెట్టారు. 

ఈరోజుల్లో ఏ సినిమాకి ‘మా ఇంటి బంగారం’ వంటి పాత పేరు పెట్టడం లేదు కనుక ఇది బహుశః వెబ్‌ సిరీస్‌ కావచ్చు. దీనిని ఆమె సొంత సినీ నిర్మాణ సంస్థ ట్రాలాలా బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. దీనికి దర్శకుడు ఎవరు? దీనిలో నటించబోయే నటీనటులు ఎవరు? సాంకేతిక నిపుణులు ఎవరు? అనే వివరాలు ప్రకటించలేదు. త్వరలోనే ప్రకటిస్తారేమో?


Related Post

సినిమా స‌మీక్ష