సల్మాన్ ఖాన్‌తో రష్మిక సినిమా ఛాన్స్!

May 09, 2024


img

పుష్ప, యానిమల్ సినిమాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన రష్మిక మందన, బాలీవుడ్‌ అగ్రహీరో సల్మాన్ ఖాన్‌తో నటించేందుకు మరో సినిమా ఛాన్స్ దక్కించుకుంది. 

ఈవిషయం రష్మిక స్వయంగా అభిమానులకు తెలియజేస్తూ, “మీరందరూ నా సినిమా అప్‌డేట్‌ గురించి ఎదురుచూస్తుంటారని తెలుసు. అందుకే ఈ విషయాన్ని మీ అందరితో పంచుకోవాలని అనుకుంటున్నాను.

బాలీవుడ్‌లో ‘సికిందర్’ అనే సినిమాలో నేను నటించబోతున్నాను. ఇంత గొప్ప ప్రాజెక్టులో నాకు అవకాశం రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎంతో గౌరవంగా భావిస్తున్నాను,” అంటూ ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ పెట్టింది. 

తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సాజీద్ నడియావాలా ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మొదట కియరా అద్వానీని హీరోయిన్‌గా తీసుకోవాలని అనుకున్నప్పటికీ రష్మిక మందన నటన చూసిన తర్వాత ఆమె అయితేనే తీవ్ర భావోద్వేగాలతో కూడిన ఈ పాత్రకు న్యాయం చేయగలదని తీసుకున్నట్లు తెలుస్తోంది. 

రష్మిక ప్రస్తుతం పుష్ప-2లో నటిస్తోంది. అది పూర్తికాగానే ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటారు. సల్మాన్ ఖాన్ సినిమా అంటే యాక్షన్, కామెడీ, పంచ్ డైలాగ్స్, భావోద్వేగాలు అన్నీ సమపాళ్ళలో ఉంటాయి. కనుక రష్మిక మందన పెద్ద హీరోతో మంచి సినిమా ఛాన్స్ దక్కించుకుండానే చెప్పవచ్చు. ఈ సినిమా హిట్ అయితే రష్మిక బాలీవుడ్‌లో బిజీ అయిపోవచ్చు కనుక దక్షిణాది సినీ ఇండస్ట్రీకి దూరం అయ్యే అవకాశం కూడా ఉంది. 


Related Post

సినిమా స‌మీక్ష