విజయ్‌ దేవరకొండ కొత్త సినిమా ప్రకటన

May 09, 2024


img

నేడు (మే 9) విజయ్‌ దేవరకొండ పుట్టిన రోజు సందర్భంగా కొత్త సినిమా ప్రకటన విడుదల చేసింది. ఈ సినిమాకు రవికిరణ్ కోల దర్శకత్వంలో శ్రీ వేంకటేశ్వర క్రియెషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మించబోతున్నారు.

ఎస్‌వీసి59 వర్కింగ్ టైటిల్‌తో విడుదల చేసిన పోస్టర్లో ఎర్రటి ఎరుపు బ్యాక్ గ్రౌండ్లో ఓ కత్తి పట్టుకున్న చేతిని చూపుతో, “కత్తి నేనే, నెత్తురు నాదే, యుద్ధం నాతోనే’ అంటూ సినిమాలో చాలా సీరియస్ మ్యాటర్ ఉందని చెప్పకనే చెప్పారు. 

ఈ సినిమాని 5 భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మించబోతున్నట్లు తెలియజేస్తూ, 5 భాషల్లో సినిమా ప్రకటన పోస్టర్స్ విడుదల చేశారు. ఈ సినిమాకు సంబందించి వివరాలు ఇంకా ప్రకటించవలసి ఉంది. 

దీని కంటే ముందు విజయ్‌ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ యాక్షన్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో విజయ్‌ దేవరకొండకు జోడీగా శ్రీలీల నటిస్తోంది. ఈ సినిమాలో విజయ్‌ దేవరకొండ ఓ సీక్రెట్ ఏజంట్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. 


Related Post

సినిమా స‌మీక్ష