సుహాస్ ‘గొర్రె పురాణం’… సినిమా పేరే వెరైటీగా ఉంది!

May 10, 2024


img

తెలుగు సినీ పరిశ్రమలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తర్వాత చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌, వెంకటేష్, నాగార్జున, వారి తర్వాత జూ.ఎన్టీఆర్‌, ప్రభాస్‌, అల్లు అర్జున్‌, మహేష్‌ బాబు ఇలా కొత్త తరం నటులు వస్తూనే ఉన్నారు. ఇప్పుడు వారి తర్వాత విజయ్‌ దేవరకొండ, విశ్వక్ సేన్‌, సిద్ధూ జొన్నలగడ్డ, ప్రియదర్శి, సుహాస్ వంటివారు సినీ పరిశ్రమలో తమ స్థానం ఏర్పాటు చేసుకుంటున్నారు. 

వీరిలో ప్రతీ ఒక్కరూ సరికొత్త కధలు, విలక్షణమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రసన్న వదనం సినిమాతో అందరినీ మెప్పించిన సుహాస్, ఇప్పుడు ‘గొర్రె పురాణం’ అనే విచిత్రమైన పేరుతో ఓ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బాబీ దర్శకత్వంలో తెర కెక్కించిన ఈ సినిమా టీజర్‌ కూడా విడుదలైంది. 

ఓ గ్రామంలో హిందూ, ముస్లింల మద్య ఓ గొర్రె కారణంగా గొడవలు జరుగుతుంటే, హీరో సుహాస్ జైలు నుంచి విడుదలైన్నట్లు టీజర్‌లో చూపారు. ఈ సినిమాలో హీరో సుహాస్ అయినప్పటికీ కధ మొత్తం గొర్రె చుట్టూనే తిరుగుతుంది కనుక సినిమాకు ‘గొర్రె పురాణం’ అని టైటిల్‌ పెట్టిన్నట్లు అర్దమవుతోంది. హిందూ, ముస్లిం వంటి సున్నితమైన అంశంతో సినిమా తీయడం అంటే కత్తి మీద సామూవంటిదే. అది తీయడమే కాకుండా దానికి కామెడీ కూడా జోడించడం ఈ సినిమా ప్రత్యేకతగా కనిపిస్తోంది. 

ఫోకల్ సినిమాస్ బ్యానర్‌పై ప్రవీణ్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు కధ, దర్శకత్వం: బాబీ, సంగీతం: పవన్‌ సిహెచ్, కేమర్: సురేశ్ సారంగం, ఆర్ట్: మోహన్ కె. తాళ్ళూరి, ఎడిటింగ్: వంశీ కృష్ణ రావి చేస్తున్నారు. 

<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/tffRKxKrZhQ?si=1yS3BXWrsZZSF1JO" title="YouTube video player" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share" referrerpolicy="strict-origin-when-cross-origin" allowfullscreen></iframe>

Related Post

సినిమా స‌మీక్ష