గామి సినిమాతో హిట్ కొట్టిన విశ్వక్ సేన్ దానికి పూర్తి భిన్నమైన యాక్షన్ చిత్రం ‘గాంగ్స్ ఆఫ్ గోదావరి’తో మే 17న ప్రేక్షకుల ముందుకు రావలసి ఉండగా కాస్త ఆలస్యంగా మే 31వ తేదీకి రాబోతున్నట్లు విశ్వక్ సేన్ స్వయంగా తెలియజేశాడు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ ‘లంకల రత్న’ అనే గ్యాంగ్ స్టర్‌గా నటిస్తున్నాడు. ఇటీవల విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది.
ఈ కధ 1960లలో గోదావరి జిల్లాలలో జరిగినట్లు చూపారు. ఓ గ్రామంలో వారందరూ హీరోని చంపేందుకు ప్రయత్నిస్తుంటే వారిని హీరో ఏవిదంగా ఎదుర్కొన్నాడు? అసలు వారు అతనిని ఎందుకు చంపాలనుకున్నారు? వారిని ఎదుర్కొంటూ హీరో అసామాన్య స్థాయికి ఏవిదంగా ఎదిగాడనేది ఈ సినిమా కధ. టీజర్‌లో విశ్వక్ సేన్ యాక్షన్ సీన్స్ అదరగొట్టేశాడు.
ఈ సినిమాలో విశ్వక్ సేన్‌కు జోడీగా నేహా శెట్టి నటిస్తోంది. అంజలి ఓ ప్రధాన పాత్ర చేస్తోంది. కృష్ణ చైతన్య దర్శకత్వంలో సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య కలిసి సీతార ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దీనికి సంగీతం: యువన్ శంకర్ రాజా, కెమెరా: అనిత్ మదాడి, ఆర్ట్: గాంధీ నడికుండికర్, ఎడిటింగ్: నవీన్ నూలి చేశారు.
Our gutsy Gangster 𝑳𝒂𝒏𝒌𝒂𝒍𝒂 𝑹𝒂𝒕𝒉𝒏𝒂 to arrive a little late but with a big Bang! 💥👊
After 5 years we coming to theatres on the same date as #FalaknumaDas, on 31st May to create history worldwide with #GangsOfGodavari 🌊🔥#GOGonMay31st 💥🔥 pic.twitter.com/EgM0PRj6pk