కన్నప్ప షూటింగ్‌లో ప్రభాస్‌

May 09, 2024


img

మంచు విష్ణు ప్రధాన పాత్రలో ‘కన్నప్ప’ సినిమా షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాలో ప్రభాస్‌ శివుడుగా నటిస్తున్నారు. అయితే ఇంతవరకు కన్నప్పలో ఇతర పాత్రదారులతో సన్నివేశాలను చిత్రీకరిస్తున్నందున ప్రభాస్‌ షూటింగ్‌లో పాల్గొనలేదు. ఇప్పుడు ప్రభాస్‌ కూడా షూటింగ్‌లో జాయిన్ అయ్యారని మంచు విష్ణు స్వయంగా తెలియజేశారు. ఈవిషయం తెలియజేస్తూ ప్రభాస్‌ కాళ్ళు మాత్రమే చూపిస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. 

ఈ సినిమాలో మంచు విష్ణుకి జోడీగా బాలీవుడ్‌ నటి నుపూర్ సనన్ నటిస్తోంది. మలయాళ నటుడు మోహన్ లాల్, కన్నడ నటుడు శివరాజ్ కుమార్‌ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు చేస్తున్నారు. 

స్టార్ ప్లస్ టీవీలో ప్రసారమైన మహాభారత్ హిందీ సీరియల్‌కు దర్శకత్వం వహించిన ముఖేష్ కుమార్‌ సింగ్‌ కన్నప్ప సినిమాకు దర్శకత్వంలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.  

కన్నప్ప సినిమాకు మణిశర్మ, స్టీఫెన్ దేవాస్సీ: సంగీతం, షెల్డన్ షావ్: కెమెరా, చిన్న ఆర్ట్ డైరెక్ట ర్‌గా పనిచేస్తున్నారు.  

ఈ సినిమాను అవా ఎంటర్‌టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు, మంచు విష్ణు కలిసి 5 భాషల్లో నిర్మిస్తున్నారు.



Related Post

సినిమా స‌మీక్ష