ప్రవాస భారతీయులకు ఆ గడువు పెరిగింది

June 27, 2017
img

విదేశాల్లో స్థిరపడిన భారత సంతతికి చెందినవారు తమ భారత్ పౌరసత్వం వదులుకోకూడదనుకొన్నట్లయితే వారు 2017, డిశంబర్ 31లోగా ఒసిఐ (ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా) కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని కేంద్రప్రభుత్వం తెలిపింది. ఇదివరకు దీని కోసం పి.ఐ.ఐ.(పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్) కార్డులను జారీ చేసేది. 2015 నుంచి దాని స్థానంలో ఒసిఐ కార్డులను జారీ చేస్తోంది. కనుక ఇదివరకు పి.ఐ.ఐ. కార్డులు తీసుకొన్నవారు ఒసిఐ కార్డులకు మారడానికి జూన్ 30 వరకు వీలు కల్పించింది. ఆ గడువును ఇప్పుడు డిశంబర్ 31 వరకు పొడిగించింది. 


Related Post