రాహుల్ మాట్లాడుతుంటే కాంగ్రెస్‌ ఎంపీలు నవ్వులు

February 04, 2026
img

భారత్‌-అమెరికా మద్య నాలుగు నెలల తర్వాత హటాత్తుగా వాణిజ్య సంబంధాలపై ఏకాభిప్రాయం కుదరడం, వెంటనే ట్రంప్‌ భారత్‌పై సుంకాలు తగ్గించడంపై కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ అనుమానాలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను కాదని అమెరికాకు దాసోహం అనడం వెనుక అదానీ గ్రూప్ మీద అమెరికాలో కేసు నమోదవడమే కారణమని రాహుల్ గాంధీ ఆరోపించారు. అమెరికా, అదానీ ఒత్తిడితోనే కేంద్ర ప్రభుత్వం హడావుడిగా ఈ వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేసిందని ఆరోపించారు. 

ఇది దేశ భద్రతకు సంబందించిన అంశం అంటూ రాహుల్‌ గాంధీ గంభీరంగా ప్రసంగం మొదలుపెట్టగానే ఆయన వెనుక కూర్చున్న కాంగ్రెస్‌ ఎంపీలు పకపకా నవ్వారు. అప్పుడు బిజేపి ఎంపీ జగదాంబిక పాల్ జోక్యం చేసుకుంటూ, “మీ నాయకుడు మాట్లాడుతుంటే ఎందుకు నవ్వుతున్నారు? మీ నాయకుడిని గౌరవించడం నేర్చుకోండి,” అంటూ హితవు పలికారు. ఈ వీడియోని బిజేపి సోషల్ మీడియాలో పోస్ట్ చేయాగా వైరల్ అవుతోంది.

Related Post