రామ్ అబ్బరాజు దర్శకత్వంలో శర్వానంద్, సంయుక్త, సాక్షి వైద్య హీరో హీరోయిన్లుగా నటించిన ‘నారి నారీ నడుమ మురారి’ గత నెల 14న సంక్రాంతి పండుగకు విడుదలయ్యి సూపర్ హిట్ సినిమాల జాబితాలో చేరింది. ఇప్పుడీ సినిమా నేటి నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం కాబోతోంది. థియేటర్లలో ఈ సినిమా చూడలేకపోయినవారు ఇప్పుడు ఇంట్లో కూర్చొని చూసి ఆనందించవచ్చు.
ఈ సినిమాలో నరేష్, వెన్నెల కిషోర్, సునీల్, శ్రీవిష్ణు, సత్య ఆకెళ్ళ అందరూ కలిసి ట్రైలర్‌లో కామెడీ అదరగొట్టేశారు.
ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కి దర్శకత్వం: రామ్ అబ్బరాజు, సంగీతం: విశాల్ చంద్రశేఖర్, కెమెరా: జ్ఞాన శేఖర్, యువరాజ్ చేశారు.
ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, అడ్వంచర్స్ ఇంటర్నేషనల్ బ్యానర్లపై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర కలిసి నిర్మించారు.