ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ డేట్ లాక్

February 04, 2026


img

హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్‌ కళ్యాణ్‌, శ్రీలీల జంటగా చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్‌’ సినిమా కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. వారి ఎదురు చూపులకు ఫుల్ స్టాప్ పెడుతూ మార్చి 26న సినిమా రిలీజ్ చేయబోతున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్‌ నేడు ప్రకటించింది.  

ఈ సినిమాలో సాక్షి వైద్య, అశుతోష్ రానా, నవాబ్ షా, గౌతమి, చమ్మక్‌ చంద్ర, అవినాష్, గిరి, నాగ మహేష్ బాబు, నర్రా శ్రీను, టెంపర్ వంశీ ముఖ్యపాత్రలు చేస్తున్నారు. 

ఇది 2016 లో విడుదలైన తమిళ సినిమా ‘తేరి’కి తెలుగు రీమేక్. ఈ సినిమాకి దర్శకత్వం: హరీష్ శంకర్‌, స్క్రీన్ ప్లే: కె.దశరద్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: ఆయాంకా బోస్, ఎడిటింగ్: ఉజ్వల్ కులకర్ణి చేస్తున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి కలిసి నిర్మిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్‌ మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. 


Related Post

సినిమా స‌మీక్ష