మూడేళ్ళలో యాదాద్రికి ఎంఎంటిఎస్ రైళ్ళు

February 04, 2026
img

నేటి నుంచి సుమారు మూడేళ్ళలోగా సికింద్రాబాద్‌ స్టేషన్ నుంచి యాదాద్రికి ఎంఎంటిఎస్ రైళ్ళు అందుబాటులోకి వస్తాయి. దీని కోసం రైల్వేశాఖ రూ. 430 కోట్లు కేటాయించింది. దీని కోసం భూసేకరణ పనులు పూర్తవడంతో రైల్వే స్టేషన్‌ ట్రాక్ నిర్మాణ పనులకు టెండర్లు పిలిచి రైల్ వికాస్ నిగమ్‌కు ఈ కాంట్రాక్ ఖరారు చేశారు.

ఘట్ కేసర్ నుంచి 33 కిమీ దూరంలో ఉన్న రాయగిరి రైల్వేస్టేషన్‌ వరకు ఈ సంస్థ కొత్తగా రైల్వే స్టేషన్‌ ట్రాక్ నిర్మిస్తుంది. దానిలో చర్లపల్లి రైల్వే స్టేషన్‌ని కూడా కలుపుతూ నిర్మిస్తుంది. కనుక ఇతర రాష్ట్రాల నుంచి సికింద్రాబాద్‌, చర్లపల్లిలో దిగి అక్కడి నుంచే నేరుగా ఎంఎంటిఎస్ రైళ్ళలో సులువుగా రాయగిరి స్టేషన్ చేరుకోవచ్చు. అక్కడి నుంచి 4 కిమీ దూరంలో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం ఉంది.

టెండర్ల ప్రక్రియ పూర్తయింది కనుక తక్షణమే పనులు మొదలుపెట్టి 2029లోగా ఈ మార్గంలో ఎంఎంటిఎస్ రైళ్ళు అందుబాటులోకి తీసుకువస్తారు. 

Related Post