తెలంగాణలో పవన్ కళ్యాణ్‌ ఎన్నికల ప్రచారం

February 04, 2026


img

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఏపీ డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌ పాల్గొనబోతున్నారు. ఈ ఎన్నికలలో జనసేనకు బలమున్న స్థానాలలో పోటీ చేస్తోంది. కనుక పార్టీ అభ్యర్ధుల తరపున ఈ నెల 7,8 తేదీలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. పనిలో పనిగా బిజేపి తరపున కూడా ప్రచారంలో పాల్గొనబోతున్నారు. పవన్ కళ్యాణ్‌ ఏయే జిల్లాలో ఎప్పుడు ప్రచారంలో పాల్గొంటారో రూట్ మ్యాప్, షెడ్యూల్ ఒకటి రెండు రోజులలో జనసేన పార్టీ ఖరారు చేసి ప్రకటిస్తుంది. 

ఈ నెల 11న మున్సిపల్ ఎన్నికలకు పోలింగ్ జరుగుతుంది. కనుక ఎన్నికల నియామావళి ప్రకారం 9వ తేదీ సాయంత్రం వరకే ఎన్నికల ప్రచారానికి గడువు ఉంటుంది. గడువు చాలా తక్కువగా ఉండటంతో ఇప్పటికే అన్ని పార్టీలు జోరుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నాయి.      



Related Post