జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కి కూడా క్లీన్ చిట్!

February 04, 2026


img

తెలంగాణ శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కుమార్‌ నేడు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కి కూడా క్లీన్ చిట్ ఇచ్చేశారు. ఆయన కూడా తాను నేటికీ బీఆర్ఎస్‌ పార్టీలోనే ఉన్నానని స్పీకర్‌కి తెలియజేశారు. ఎమ్మెల్యేగా ప్రభుత్వం తనకు ఇచ్చే జీతం నుంచి నెలనెలా రూ.5,000 బీఆర్ఎస్‌ పార్టీ బ్యాంక్ ఖాతాకి జామా అవుతుండటమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. 

తాను నియోజకవర్గం అభివృద్ధి పనుల కోసం సిఎం రేవంత్ రెడ్డిని కలిస్తే ఆయన తన మెడలో కాంగ్రెస్‌ కండువా వేశారు తప్ప తాను కాంగ్రెస్‌ పార్టీలో చేరలేదన్నారు. చేరినట్లు తాను ఎన్నడూ అనలేదని తెలిపారు. నేటికీ తాను బీఆర్ఎస్‌ పార్టీలోనే ఎమ్మెల్యేగా ఉన్నానని స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కుమార్‌కి లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చారు. దానిపై సంతృప్తి చెందిన స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కుమార్‌ సంజయ్‌పై అనర్హత వేటు వేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. 

ఇప్పటి వరకు మొత్తం 10 మంది బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ పార్టీలో చేరగా వారిలో స్పీకర్‌ 8 మందికి క్లీన్ చిట్ ఇచ్చారు. ఇక మిగిలింది కడియం శ్రీహరి, దానం నాగేందర్‌. వారిరువుపై విచారణని ఈ నెల 19కి వాయిదా వేశారు. 


Related Post