నటుడు చంద్రహాస్‌పై పోలీస్ కేసు నమోదు

February 05, 2026


img

టీవీ నటుడు ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్‌పై మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అతను 2024లో ‘రామ్‌ నగర్‌ బన్నీ’ అనే సినిమాతో హీరోగా తెలుగు సినీ పరిశ్రమలో ప్రవేశించాడు. ఇప్పుడు రెండో సినిమా ‘బరాబర్ ప్రేమిస్తా’తో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. 

ఇటీవల ఆ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో చంద్రహాస్ పచ్చి బూతులతో ఓ పాట పాడాడు. దానిపై అప్పుడే పలువురు తీవ్ర అభ్యంతరం తెలిపారు కూడా. సోషల్ మీడియాలో కూడా చంద్రహాస్‌పై విమర్శలు వచ్చాయి. ఓ ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్‌కు చెందిన ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ కుమార్‌ వేముల అతని తీరుని తప్పు పడుతూ తమ న్యూస్ ఛానల్లో ఓ కధనం ప్రసారం చేశారు. 

అప్పటికైనా చంద్రహాస్ వెనక్కు తగ్గి క్షమాపణలు చెప్పుకొని ఉంటే ఇక్కడితో ఈ వివాదం ముగిసిపోయేది. కానీ తనని చాలా మంది చాలా రకాలుగా అవమానించారని, వాటిలో రెండు బూతులు మాత్రమే పలికితే సమాజానికి ఎందుకు ఇంత ఆగ్రహం? ఆవేశం? అంటూ ప్రశ్నించాడు. నేను ఎవరికీ సారీ చెప్పే ప్రసక్తే లేదు. నేను అన్న మాటలకు కట్టుబడి ఉన్నాను.

నా గురించి నా కుటుంబం గురించి కధనం ప్రసారం చేసిన ఆ జర్నలిస్టు 24 గంటలలోగా క్షమాపణ చెప్పకపోతే నీ భరతం పడతానంటూ బెదిరించాడు.

దీంతో ఆయన మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేశారు. పోలీసులు చంద్రహాస్‌పై కేసు నమోదు చేశారు.


Related Post

సినిమా స‌మీక్ష