కోలీవుడ్ నుంచి మరో నటుడు రాజకీయాల్లోకి ప్రవేశించబోతున్నారు. ఆయనే రాఘవ లారెన్స్. అయితే అయన కూడా అన్నామలై లాగే ఎన్నికలైపోయి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజకీయాలలోకి వస్తుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆయన తిరుచురాపల్లి (ఈస్ట్) ఉప ఎన్నికలలో పోటీ చేయబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
టీవీకే పార్టీ అధినేత విజయ్ పెరంబూర్, తిరుచురాపల్లి (తిరుచ్చి ఈస్ట్) నుంచి పోటీ చేసి రెండు నియోజకవర్గాలలో గెలిచారు. వాటిలో ఒక దానికి రాజీనామా చేసి వదులుకోవాల్సి ఉంటుంది కనుక తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గాన్ని వదులుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆ స్థానానికే రాఘవ లారెన్స్ పోటీ చేయబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
రాఘవ లారెన్స్ కూడా వాటిని కొట్టిపడేయలేదు. ఆ ఊహాగానాలపై ఈ నెల 11న ప్రకటన చేస్తానని ట్వీట్ చేశారు. అంటే అయన అక్కడి నుంచి ఉప ఎన్నికలో పోటీ చేయడం ఖాయమేనని భావించవచ్చు.

Hi everyone, News about me contesting in Trichy East election has been circulating across various media platforms.

All my Media friends have been reaching out to me over phone and requesting to meet me asking for clarification. Since the speculation has grown to a point where I… pic.twitter.com/68ZyN6P0l9
— Raghava Lawrence (@offl_Lawrence) June 7, 2026