కళ్ళు, నోరు మూసుకొని గుడ్డిగా ఫాలో అవ్వాలా? ప్రకాష్ రాజ్

June 07, 2026

img

నటుడు ప్రకాష్ రాజ్ మళ్ళీ ట్వీటేశారు. ఈసారి జనసేన ఎమ్మెల్సీ నాగబాబు ట్వీట్‌కి బదులుగా ట్వీట్‌ వేశారు.

ఇంతకీ నాగబాబు ఏమని ట్వీట్‌ చేశారంటే, “నాయకుడు మాటే ఫైనల్. ఆ దారిలో ఎన్ని దెయ్యాలు, రాక్షసులు ఉన్నాయో ఎవరూ చూడలేదు. కనుక ఏది మంచి ఏది చెడు అనేది ఆయనకు మాత్రమే తెలుసు. కనుక అందరూ మీ అనుమానాలు కట్టిబెట్టి, నోరు మూసుకొని ఎటువంటి ప్రశ్నలు అడగకుండా నాయకుడిని అనుసరించండి,” అంటూ పవన్ కళ్యాణ్‌ ఫోటోతో ప్రజల నాయకుడు అని నాగబాబు ట్వీట్‌ చేశారు.

దీనిపై ప్రకాష్ రాజ్ స్పందిస్తూ, “అనుమానాలు మానుకొని, నోరు మూసుకొని నాయకుడిని ప్రశ్నించకుండా  అనుసరించమని చెప్పడంలో మీ ఉద్దేశ్యం ఏమిటి? మేము గొర్రెలం కాము బానిస బ్రతుకు బ్రతకడానికి. నాగబాబుగారు ఈ బెదిరింపులు వద్దు. ప్రశ్నించడం మా హక్కు. ఏ నాయకుడినైనా... నేనే నాయకుడిని అనుకున్నవాడైనా సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. అర్థం అయ్యిందా? #జస్ట్ ఆస్కింగ్” అని ట్వీట్‌ చేశారు.

What do you mean by “ Shut your doubts,silence your tongue and follow the Leader without questions” మేము గొర్రెలం కాదు... బానిస బ్రతుకు బ్రతకడానికి.
ఈ బెదిరింపులు వద్దు @NagaBabuOffl నాగబాబు గారు. ప్రశ్నించడం మా హక్కు.
ఏ నాయకుడైనా.. నేనే నాయకుడిని అనుకున్నవాడైనా, సమాధానం… https://t.co/d3Y4nX5XkT
— Prakash Raj (@prakashraaj) June 6, 2026

Related Post

సినిమా స‌మీక్ష