విజయ్ దేవరకొండ, రష్మిక మందన పెళ్ళి తర్వాత జంటగా చేస్తున్న సినిమా ‘రణబాలి.’ పెళ్ళి కాగానే ఇద్దరూ హనీమూన్‌కి ఏ విదేశాలో చేక్కేస్తారనుకుంటే రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న రణబాలి కోసం వేసవి ఎండలతో భగభగ మండుతున్న రాయలసీమకు చేరుకున్నారు. అక్కడ గండికోట పరిసర ప్రాంతాలలో వారం రోజుల పాటు ఇద్దరూ షూటింగ్‌లో పాల్గొన్నారు.
తాజా సమాచారం ప్రకారం ఇంతవరకు 100 రోజుల పాటు జరిగిన షూటింగ్‌లో 90 శాతం పూర్తి చేశారు. ఇక మిగిలిన పది శాతం కూడా త్వరలో పూర్తి చేసి వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టేందుకు చకచకా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రణబాలి సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.
ఇది 1854-78 మద్య బ్రిటిష్ కాలంలో రాయలసీమలో జరిగిన యదార్ధ ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. రణబాలిలో దక్షిణాఫ్రిక నటుడు ఆర్నాల్డ్ వస్లూ బ్రిటిష్ అధికారిగా నటిస్తున్నారు.
ఈ సినిమాకు కథ: ప్రమోద్ తమ్మినేని, సంగీతం: అజయ్-అతుల్, కెమెరా: నీరవ్ షా, ఎడిటింగ్: కార్తిక శ్రీనివాస్, ఆర్ట్: వితల్ కొసనం, స్టంట్స్: యానిక్ బెన్, అండీ లాంగ్ గుయెన్, రాబిన్ సుబ్బు చేస్తున్నారు.
గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్, టీ సిరీస్ బ్యానర్లపై నవీన్ ఎర్నేని, రవి శంకర్ కలిసి 5 భాషల్లో రణబాలి నిర్మిస్తున్నారు.