సింగ్ గీతం సినిమా ఎలా ఉంటుందో కానీ ప్రమోలు మాత్రం..

June 05, 2026


img

ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు (94 ఏళ్ళు) వయసులో తీసిన ‘సింగ్..గీతం’ ఈ నెల 11న విడుదల కాబోతోంది. ఆ వయసులో ఆయన తీసిన ఈ సినిమా... దాని టైటిల్‌ చూస్తే ఈ సినిమా ఎలా ఉంటుందో ఊహించలేము కానీ దానికి వారి టీమ్‌ వెరైటీగా చేస్తున్న ప్రమోషన్స్ మాత్రం అందరినీ అలరిస్తున్నాయి.

నాలుగు రోజుల క్రితం కల్కి-2 సెట్స్‌లో ‘సింగ్..గీతం’ నటీనటులతో నిహారిక కొణిదెల పరిచయ కార్యక్రమం చాలా వెరైటీగా ఉందనుకుంటే నేడు మరో వీడియో వదిలారు.

దాని టైటిల్‌ కూడా విచిత్రంగానే ఉంది. సినిమా ప్రమోషన్స్ ఏవిధంగా చేయకూడదంటే... అంటూ వీడియో రిలీజ్‌ చేశారు.

ప్రమోషన్స్ అంటే హైదరాబాద్‌ లేదా ముంబయిలోనో అనుకుంటే రైలు బోగీలో, రోడ్డు పక్క చాయ్ దుకాణంలో, రోడ్ పక్కన బ్యానర్ పెట్టుకొని పైనాపిల్ పళ్ళు అమ్ముకుంటూ ప్రమోషన్స్ చేయడం చూస్తున్నప్పుడు నిజమే సినిమా ప్రమోషన్స్ ఈవిధంగా కాదనిపిస్తుంది.

కానీ వీడియో అందరినీ అలరించి సినిమాపై ఆసక్తి పెంచుతోంది కనుక సినిమాకి ఈవిధంగా కూడా ప్రమోషన్స్ చేయవచ్చనిపిస్తుంది.       

ఈ సినిమాలో అయాన్, ఆహిల్య, షాలిని ముఖ్యపాత్రలు చేస్తున్నారు. వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్లపై దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మాతగా ఈ సినిమా నిర్మిస్తుండటం మరో విశేషం. 

ఈ సినిమాకి సింగీతం శ్రీనివాసరావు, గౌతమి చల్లగుళ్ళ, శశాంక్‌ చింతలపూడి, రత్న శ్రీకర్,  నంద కిషోర్ ఈమని, రాహుల్ వి రాజేశ్వర్ కలిసి కథ తయారు చేశారు. ఈ సినిమాకు సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: అంకుర్ సి, పాటలు: శ్రీమణి చేశారు. 


Related Post

సినిమా స‌మీక్ష