సోల్ ఆఫ్ లెనిన్ చూశారా?

June 05, 2026


img

అక్కినేని కుటుంబంలో నాగార్జున, నాగ చైతన్య ఇద్దరూ అడపా దడపా హిట్స్ కొడుతూనే ఉన్నారు. కానీ అఖిల్ అక్కినేనికి మాత్రం ఇంతవరకుఒక్క హిట్ కూడా పడలేదు. అలాగని అతని ప్రయత్నలోపం కూడా ఏమీ లేదు. ఎప్పటికప్పుడు కొత్త కథలతో సినిమాలు చేస్తున్నారు. కానీ ఇంకా బ్రేక్ దొరకలేదు. ఆ బ్రేక్ త్వరలో విడుదల కాబోతున్న లెనిన్ సినిమాతో తప్పక దొరుకుతుందనిపిస్తోంది నేడు విడుదలైన ‘సోల్ ఆఫ్ లెనిన్’ వీడియో చూస్తే.   

మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో అక్కినేని అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా చేస్తున్న ‘లెనిన్’ గ్రామీణ నేపధ్యంలో సాగే ఓ రొమాంటిక్ కమర్షియల్ సినిమా. దీనికి సంగీతం: తమన్, కెమెరా: ఐ నవీన్ కుమార్‌, ఎడిటింగ్: నవీన్ నూలి చేశారు. 

అన్నపూర్ణా స్టూడియోస్, సీతారా ఎంటర్‌టైన్‌మెంట్స్‌, మనం ఎంటర్‌ప్రైజస్ ఎల్ఎల్‌పీ బ్యానర్లపై అక్కినేని కుటుంబం, సూర్యదేవర నాగవంశీ కలిసి నిర్మించిన లెనిన్ ఈ నెల 26న విడుదల కాబోతోంది.  


Related Post

సినిమా స‌మీక్ష