పెద్ది ఫస్ట్-డే కలెక్షన్ రూ.135.36 కోట్లు

June 05, 2026


img

అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురుచూసిన పెద్ది సినిమా గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఊహించినట్లే మంచి పాజిటివ్ టాక్‌తో సూపర్ హిట్ అనిపించుకుంది. 

పెద్ది మొదటి రోజున ప్రపంచవ్యాప్తంగా రూ. 135.36 కోట్లు కలెక్షన్స్‌ సాధించడంతో అభిమానులు, చిత్ర బృందం సంబురాలు చేసుకుంటున్నారు. పెద్ది ఫస్ట్-డే కలెక్షన్ రూ.135.36 కోట్లు అని తెలియజేస్తూ చిత్ర బృందం ఓ పోస్టర్ కూడా విడుదల చేసింది, దానిలో హనుమంతుడి విగ్రహం ముందు పహిల్వాన్ పెద్ది గధ పట్టుకొని ఆశీర్వచనం కోరుతున్నట్లు ఉంది. 

పెద్ది సినిమా షూటింగ్‌ మొదలుపెట్టినప్పటి నుంచే దర్శకుడు బుచ్చిబాబు సినిమాకి హైప్ సృష్టిస్తూనే ఉన్నారు. దాని ఫలితమే ఇంత భారీ కలెక్షన్స్‌. పెద్దిని చూడాలని ఎదురుచూస్తున్నవారు ఇంకా కోట్ల మంది ఉన్నారు. కనుక మొదటి పది రోజులలోనే పెద్ది కలెక్షన్స్‌ వెయ్యి కోట్లు దాటేసినా ఆశ్చర్యం లేదు.  


Related Post

సినిమా స‌మీక్ష