జన నాయగన్... సరైన నిర్ణయమే

June 05, 2026


img

తమిళనాడు సిఎం విజయ్‌ చివరిగా నటించిన సినిమా జన నాయగన్ ఈ ఏడాది జనవరి 9న విడుదల కావాల్సి ఉండగా సెన్సార్ బోర్డు అనుమతించకపోవడంతో నేటికీ విడుదల కాలేదు. 

ఇప్పటికే ఆరు నెలలు గడిచిపోయాయి. కానీ ఇంకా ఎప్పుడు అనుమతిస్తుందో తెలీని పరిస్థితి. కనుక సిఎం విజయ్‌ సూచన మేరకు ఆ సినిమా నిర్మించిన కేవీఎన్ ప్రొడక్షన్స్ డిస్ట్రిబ్యూటర్లకు అడ్వాన్స్ వాపసు చేయబోతోంది. 

ఈ సినిమా కోసం వారు సుమారు ఏడాది క్రితమే నిర్మాణ సంస్థకు అడ్వాన్సులు ఇచ్చారు. కానీ సినిమా విడుదల కాకపోగా, ఇప్పుడు విజయ్‌ సిఎం అవడంతో ఆయనని ధైర్యంగా అడగలేని పరిస్థితి. కనుక తమ సొమ్ము వాపసు వస్తుందనే ఆశ వదులుకున్నారు.

 కానీ విజయ్‌ సిఎం అయినప్పటికీ సినీ పరిశ్రమలో అందరి కష్టాలు, కన్నీళ్ళు చూసిన వ్యక్తి కనుక తన సినిమా వలన డిస్ట్రిబ్యూటర్లు నష్టపోకూడదనుకున్నారు. అందుకే నిర్మాతతో మాట్లాడి వారికీ అడ్వాన్స్ డబ్బు తిరిగి ఇప్పిస్తున్నారు. సెన్సార్ బోర్డు సినిమాకి గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చిన తర్వాత అప్పుడు సొంతంగా  లేదా మళ్ళీ డిస్ట్రిబ్యూటర్లతో మాట్లాడుకొని సినిమా రిలీజ్‌ చేసుకుందామని సిఎం విజయ్‌ చెప్పినట్లు తెలుస్తోంది. 

సినిమా జన నాయగన్ నిజ జీవితంలో కూడా ఈవిధంగా మానవతా దృక్పదంతో వ్యవహరించడం చాలా అభినందనీయమే.


Related Post

సినిమా స‌మీక్ష