బాలీవుడ్‌లో కొత్త జంట: అమీర్ ఖాన్, గౌరీ స్ప్రాట్‌

June 04, 2026


img

కొంతమంది సినీ నటీనటులు, రాజకీయ నాయకులు 70-80 ఏళ్ళ వయసులో మూడో లేదా నాలుగో పెళ్ళి చేసుకుంటుంటే, మరికొంత మంది పెళ్ళి చేసుకోకుండా జీవితాలు గడిపేస్తుంటారు.

బాలీవుడ్‌లో కండల వీరుడు సల్మాన్ ఖాన్ 60లోకి వచ్చేస్తున్నా పెళ్ళి చేసుకోకుండా హ్యాపీగా జీవించేస్తుంటే, అదే బాలీవుడ్‌లో అమీర్ ఖాన్ 60 ఏళ్ళు వచ్చేలోగా టకటకా రెండు పెళ్ళిళ్ళు చేసుకొని విడాకులు తీసుకొని ఇప్పుడు ముచ్చటగా మూడో పెళ్ళికి సిద్ధం అవుతున్నారు.             

అమీర్ ఖాన్ మొదట రీనా దత్తాని పెళ్ళి చేసుకొని ఇద్దరు పిల్లలని కన్నాక విడాకులు తీసుకున్నారు. తర్వాత కిరణ్ రావుని పెళ్ళి చేసుకొని ఓ కుమారుడిని కన్నాక 2021లో విడాకులు తీసుకున్నారు. తర్వాత ఎక్కువ టైమ్‌ తీసుకోలేదు.

తన నిర్మాణ సంస్థలో సహాయకురాలిగా చేస్తున్న గౌరీ స్ప్రాట్‌తో మళ్ళీ ప్రేమలో పడ్డారు. రెండున్నరేళ్ళ సహజీవనంలో ఇద్దరి మనసులు బాగా కలిసినందున త్వరలో ఆమెని పెళ్ళి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అమీర్ ఖాన్ వయసు ఇప్పుడు 61 ఏళ్ళు. ఇక్కడితో ఫుల్ స్టాప్ పెడతారా లేక కామా పెడతారో చూడాలి.          



Related Post

సినిమా స‌మీక్ష