ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు (94 ఏళ్ళు) వయసులో తీసిన సినిమా పేరు ‘సింగ్..గీతం.’ ఇది ఈ నెల 11న విడుదల కాబోతోంది. కనుక దీని ప్రమోషన్స్ కాస్త వెరైటీగా చేస్తున్నారు. కల్కి-2 సెట్స్‌లో ఉన్న ‘సింగ్..గీతం’ చిత్ర బృందాన్ని ఇంటర్వ్యూ చేసేందుకు నిహారిక కొణిదెల వెళ్తారు. అక్కడ ఆ టీమ్ పరిచయమే విచిత్రంగా సాగుతుంది. ఆ వీడియోని రిలీజ్ చేశారు.
ఈ సినిమాలో అయాన్, ఆహిల్య, షాలిని ముఖ్యపాత్రలు చేస్తున్నారు. వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్లపై దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మాతగా ఈ సినిమా నిర్మిస్తుండటం మరో విశేషం.
ఈ సినిమాకి సింగీతం శ్రీనివాసరావు, గౌతమి చల్లగుళ్ళ, శశాంక్ చింతలపూడి, రత్న శ్రీకర్, నంద కిషోర్ ఈమని, రాహుల్ వి రాజేశ్వర్ కలిసి కథ తయారు చేశారు. ఈ సినిమాకు సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: అంకుర్ సి, పాటలు: శ్రీమణి చేశారు.