ఆ నిర్మాతకు రెండు ఆప్షన్స్: ఆర్నెల్లు జైలు లేదా నష్టపరిహారం!

February 10, 2026


img

మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించిన తమిళ సినీ నిర్మాత మురళీ మనోహర్‌కు ఊహించని షాక్ ఇచ్చింది. చెక్ బౌన్స్ కేసులో దిగువ కోర్టు అయనకు ఆరు నెలలు జైలు శిక్ష విధించగా, దానిపై ఆయన హైకోర్టుని ఆశ్రయించారు. అయితే అక్కడ ఇంకా పెద్ద షాక్ తగిలింది. వారం రోజుల్లోగా రూ.2.5 కోట్లు బకాయి చెల్లించాలని లేకుంటే ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించాల్సిందేనని తేల్చి చెప్పింది.  

రజనీకాంత్ హీరోగా అయన కుమార్తె సౌందర్య దర్శకత్వంలో 2014లో “కొచ్చడైయాన్’ (తెలుగులో విక్రమసింహ) సినిమా వచ్చింది. ఆ సినిమా కోసం మీడియా వన్ గ్లోబల్ ఎంటర్‌టైన్మెంట్ లిమిటెడ్ డైరెక్టర్లలో ఒకరైన మురళీ మనోహర్ బెంగళూరుకి చెందినా యాడ్ బ్యూరో అడ్వర్‌తిజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అబిర్ చంద్ నహర్ నుంచి అప్పు తీసుకున్నారు. ఆ రుణం తిరిగి చెల్లింపు కొరకు ఆయన పేరిట రూ.5 కోట్లు చెక్ ఇచ్చారు. కానీ అది బౌన్స్ అవడంతో అయన జిల్లా కోర్టులో కేసు వేశారు. ఆ కేసే ఇప్పుడు మద్రాస్ హైకోర్టు వరకు వచ్చింది.


Related Post

సినిమా స‌మీక్ష