 
                                        ఇటీవల చిన్న సినిమాలు తరచూ పలకరిస్తూనే ఉన్నాయి. అటువంటిదే మిస్టర్ విలేజ్. ఏఆర్ రామకృష్ణ దర్శకత్వంలో తీస్తున్న ఈ సినిమా నుంచి ‘చిన్ని చిన్ని గుండెల్లో... అంటూ సాగే వీడియో సాంగ్ విడుదలైంది. ఈశ్వర్ ప్రసాద్ వ్రాసిన ఈ పాటకి మార్క్ ప్రశాంత్ కీస్ సంగీతం అందింఛి స్వయంగా పాడారు.
ఈ సినిమాలో మహేంద్ర సత్య, లాస్య స్మైలీ, బంచిక్ బంటీ, భార్గవి, జావీద్, బలగంలో నటించిన కీతిరి సుధాకర్ రెడ్డి, సత్య ఏలేశ్వరం, జబర్దస్త్ కార్తానందం ముఖ్య పాత్రలు చేశారు.
ఈ సినిమాకి దర్శకత్వం: ఏఆర్ రామకృష్ణ, సంగీతం: మార్క్ ప్రశాంత్ కీస్, కెమెరా: అరుణ్ కొలుగురి , ఎడిటింగ్ & డీఐ: మోజేష్ కొలుగురి చేశారు.
ఎక్స్‌ప్లోసివ్ సెంట్రల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై గాయత్రి కుమార్ ఈ సినిమా నిర్మించారు. విడుదల తేదీ ఇంకా ప్రకటించాల్సి ఉంది.