 
                                            నేడు దివంగత ఉప ప్రధాని సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జయంతి. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ఆయన జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు నేడు గుజరాత్‌లో నర్మదా నది తీరంలో ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ వద్ద జరిగే పటేల్ జయంతి ఉత్సవాలలో పాల్గొంటున్నారు.
సర్దార్ పటేల్ గురించి చెప్పుకుంటే ముందుగా ఆయన సైనిక చర్యతో హైదరాబాద్ సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేయడం గురించే అందరూ చెప్పుకుంటారు. హైదరాబాద్‌తో పాటు పలు సంస్థానాలు భారత్‌లో విలీనం అయ్యేందుకు కృషి చేసిన వ్యక్తి పటేల్.
ఆయన నెహ్రు మంత్రివర్గంలో ఉప ప్రధాని, హోమ్ మంత్రిగా ఉన్నప్పుడు కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్‌తో వివాదం ఏర్పడింది. అప్పుడు ప్రధాని నెహ్రూ ఐక్యరాజ్య సమితికి నివేదిద్దామనుకున్నారు. పటేల్ ఈ ప్రతిపాదనని తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ నెహ్రూ ఆయన మాట వినలేదు. విని ఉండి ఉంటే హైదరాబాద్ తదితర సంస్థానాలను ఏవిదంగా భారత్‌లో విలీనం అయ్యాయో కాశ్మీర్ కూడా అలాగే కలిసిపోయేది. రావణకాష్టంలా ఇలా రగులుతుండేదే కాదు కదా?