ఖమ్మంలో సీపీఎం నేత సామినేని దారుణ హత్య

October 31, 2025


img

ఖమ్మం జిల్లాలో సీపీఎం నేత సామినేని రామారావు దారుణ హత్యకు గురయ్యారు. చింతకాని మండలం పాతర్లపాడులో నివసిస్తున్న ఆయన ఎప్పటిలాగే ఈరోజు ఉదయం వాకింగ్‌కు బయలుదేరారు. దారిలో పాతర్లపాడు వద్ద ఆయనపై కొందరు దుండగులు కత్తులతో దాడి చేసి హత్య చేసి పారిపోయారు. 

ఈ సమాచారం అందగానే ఖమ్మం సీపీ సునీల్ దత్ పోలీసులను వెంటబెట్టుకొని ఘటనా స్థలానికి చేరుకొని స్థానికులతో, ఆ తర్వాత అయన కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఆయన హత్య తర్వాత పాతర్లపాడు  గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉండటంతో భారీగా పోలీసులు మొహరించారు. కేసు నమోదు చేసుకొని కుటుంబ సభ్యులు, స్థానికులు చెప్పిన వివరాల ఆధారంగా హంతకుల కోసం పోలీసులు గాలింపు మొదలుపెట్టారు. 

సామినేని రామారావు రాష్ట్ర రైతు సంఘం మాజీ కార్యదర్శిగా, పాతర్లపాడు సర్పంచిగా పనిచేశారు. కనుక వ్యక్తిగత లేదా రాజకీయ కక్షలతోనే ఎవరూ ఈ హత్య చేయించి ఉండవచ్చనే కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు. 



Related Post