 
                                        ప్రముఖ సినీ నటుడు నారా రోహిత్, శిరీషళ వివాహం శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు దంపతులు, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యి నూతన వధూవరులను ఆశీర్వదించారు.
నారా రోహిత్, శిరీష ప్రతినిధి-2 సినిమాలో జంటగా నటించినప్పుడు వారి మద్య స్నేహం ఏర్పడి ప్రేమగా మారింది. వారి ప్రేమను ఇరు కుటుంబాల పెద్దలు ఆమోదింఛి నిన్న దగ్గరుండి ఘనంగా వివాహం జరిపించారు.
ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు సోదరుడు స్వర్గీయ నారా రామమూర్తి నాయుడు కుమారుదు నారా రోహిత్. కనుక అతను రాజకీయాలలోకి ప్రవేశిస్తారనుకుంటే ఎవరూ ఊహించని విధంగా సినీ పరిశ్రమలో నటుడుగా ప్రవేశించి తనకంటూ ఓ గుర్తింపు సాధించుకున్నారు.
ఆస్ట్రేలియాలో ఉన్నత చదువులు చదువుకున్న లేళ్ళ శిరీష సినిమాలలో నటించాలని ప్రయత్నిస్తున్నప్పుడు ప్రతినిధి-2లో హీరోయిన్‌గా అవకాశం లభించింది. కానీ తొలి సినిమాతోనే ఆమె నారా రోహిత్‌తో ప్రేమలో పడి పెళ్ళి పీటలు ఎక్కారు. కనుక పెళ్ళి తర్వాత సినిమాలలో నటించకపోవచ్చు.