సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్

October 30, 2025


img

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చేస్తున్న జస్టిస్ బీఆర్ గవాయ్ పదవీ కాలం నవంబర్‌ 23తో ముగుస్తుంది. కనుక అయన స్థానంలో సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ నవంబర్‌ 24న ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ నియమాకనికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదముద్ర వేశారని తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది.   

జస్టిస్ సూర్యకాంత్ హర్యానాకు చెందినవారు. కనుక ఆ రాష్ట్రం నుంచి ఈ అత్యున్నత పదవి చేపడుతున్న వ్యక్తిగా నిలుస్తారు. జస్టిస్ సూర్యకాంత్ ఇదివరకు పంజాబ్-హర్యానా, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టులలో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 2019, మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.

కేంద్ర ప్రభుత్వం చేసిన ఆర్టికల్ 370 రద్దు, వన్ ర్యాంక్ వన్ పెన్షన్ వంటి అనేక కీలక బిల్లులపై దాఖలైన కేసులలో సుప్రీంకోర్టు ధర్మాసనంలో సభ్యుడుగా ఉన్నారు. జస్టిస్ సూర్యకాంత్ సీనియారిటీ ప్రకారం ఈ పదోన్నతి పొందబోతున్నారు. జస్టిస్ సూర్యకాంత్ 2027, ఫిబ్రవరి 9వరకు అంటే సుమారు 14 నెలల పాటు ఈ పదవిలో కొనసాగుతారు.


Related Post