రాజమౌళి-మహేష్ బాబు కలిసి ఎస్ఎస్ఎంబీ29 చేస్తున్న సంగతి తెలిసిందే. మద్యలో చిన్న బ్రేక్ దొరకడంతో ఎప్పటిలాగే ఫ్యామిలీతో వెకేషన్‌కి మాల్దీవ్స్ వెళ్ళిపోయారు. అక్కడ సముద్రంలో దిగుతున్నప్పుడు, తర్వాత స్విమ్మింగ్ పూల్లో దిగినప్పుడు తీసుకున్న రెండు ఫోటోలు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అవి చూసి అభిమానులు చాలా సంతోషిస్తున్నారు.
సినీ పరిశ్రమలో హీరోలందరూ ఏదో ఓ సినిమాలో చొక్కా విప్పి కండలు చూపినవారే. ముఖ్యంగా బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ చొక్కా విప్పని సినిమా లేదంటే అతిశయోక్తి కాదు. కానీ మహేష్ బాబు ఇప్పటి వరకు అనేక సినిమాలు చేసినా ఎన్నడూ చొక్కా విప్పలేదు. తొలిసారిగా చొక్కా లేకుండా ఫోటో దిగి పోస్ట్ చేయడంతో కండలు తిరిగిన ఆయన శరీరాన్ని చూసి అభిమానులు చాలా సంతోషిస్తున్నారు. బహుశః ఎస్ఎస్ఎంబీ29 సినిమాలో చొక్కా లేకుండా నటించాల్సిన సన్నివేశాలు ఉన్నాయేమో? అందుకే ఈ ఫోటోలు పెట్టి ఉంటారేమో? అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.