మహాకాళిలో భూమి శెట్టి ఫస్ట్ లుక్ పోస్టర్‌

October 30, 2025


img

ప్రశాంత్ వర్మ  కధతో పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వంలో ‘మహాకాళి’ అనే సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సోషియో సైంటిఫిక్ సినిమాలో ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అక్షయ్ ఖన్నా రాక్షస గురువు శుక్రాచార్యుడుగా నటిస్తున్నారు. ఆయన పాత్రను ఇదివరకే పరిచయం చేశారు. నేడు మరో పాత్రని పరిచయం చేశారు ప్రశాంత్ వర్మ. ఈ సినిమాలో భూమి శెట్టి ‘మహా’ అనే పాత్ర చేస్తున్నారు. ఈరోజు ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ విడుదల చేశారు. 

ఆర్‌కేడి  స్టూడియోస్ బ్యానర్‌పై రివాజ్ రమేష్ దుగ్గల్ నిర్మిస్తున్న ఈ సినిమాకు స్మరణ్ సాయి సంగీతం అందిస్తున్నారు.    


Related Post

సినిమా స‌మీక్ష