ప్రేమంటే... ఏమిటో టీజర్‌లో చెపుతాడట!

October 30, 2025


img

ప్రియదర్శి, అనంది సుమ జంటగా చేస్తున్న ప్రేమంటే సినిమా టీజర్‌ నవంబర్‌ 2న విడుదల కాబోతోంది. నవనీత్ శ్రీరామ్‌ దర్శకత్వంలో తీస్తున్న ఈ సినిమాలో సుమ కనకాల ఓ ముఖ్య పాత్ర చేస్తున్నారు. 

ఈ సినిమాకి కధ, దర్శకత్వం: నవనీత్ శ్రీరామ్‌, సంగీతం: లియాన్ జేమ్స్, కెమెరా: విశ్వనాథ్ రెడ్డి, ఎడిటింగ్: రవిచంద్ర తిరున్, ఆర్ట్: అరవింద్ ములే చేస్తున్నారు.  

స్పిరిట్ మీడియా బ్యానర్‌పై రానా దగ్గుబాటి సమర్పణలో పుస్కుర్ రామ్ మోహన్ రావు, జాన్వీ నారంగ్‌ కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు. సినిమా విడుదల తేదీ ఇంకా ప్రకటించాల్సి ఉంది.


Related Post

సినిమా స‌మీక్ష