గర్ల్ ఫ్రెండ్ నుంచి మరో పాట ప్రమో!

October 30, 2025


img

రష్మిక మందన, దీక్షిత్ శెట్టి జంటగా చేసిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ నుంచి ముచ్చటగా మూడో పాట శుక్రవారం సాయంత్రం 4.05 గంటలకు విడుదల కాబోతోంది. ముందుగా నేడు ఈ పాట ప్రమో విడుదల చేశారు. ‘లాయ్ లాయ్ లే...’ అంటూ సాగే ఈ పాటని రాకేందు మౌళి వ్రాయగా హేషమ్ అబ్దుల్ వాహబ్ స్వరపరిచి, సంగీతం అందించారు. ఈ పాటని కపిల్ కపిలన్ అద్భుతంగా పాడారు. 

ఈ సినిమాకు కధ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: రాహుల్ రవీంద్రన్, సంగీతం: హేషమ్ అబ్దుల్ వాహబ్, కెమెరా: కృష్ణన్ వసంత్, ఎడిటింగ్: చోట కే ప్రసాద్ చేశారు. 

గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై విద్యా కొప్పినీడి, ధీరజ్ మొగిలినేని కలిసి ఈ సినిమాని తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషలలొ పాన్ ఇండియా మూవీగా నిర్మించిన ఈ సినిమా నవంబర్‌ 7న విడుదల కాబోతోంది.


Related Post

సినిమా స‌మీక్ష