గర్ల్ ఫ్రెండ్ నుంచి లాయి లే లిరికల్

October 31, 2025


img

రష్మిక మందన, దీక్షిత్ శెట్టి జంటగా చేసిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ నుంచి ముచ్చటగా మూడో పాట ‘లాయ్ లాయ్ లే...’ అంటూ సాగే మూడో పాట నేడు విడుదలైంది. 

రాకేందు మౌళి వ్రాయగా హేషమ్ అబ్దుల్ వాహబ్ స్వరపరిచి, సంగీతం అందించారు. ఈ పాటని కపిల్ కపిలన్ అద్భుతంగా పాడారు. 

గర్ల్ ఫ్రెండ్ అనగానే ఓ... ప్రేమ కధా? అనుకుంటారు ఎవరైనా. కానీ ఇది మామూలు ప్రేమ కధ కాదు. ప్రేమలో పడినవారు నిజంగానే ఒకరినొకరు బేషరతుగా ప్రేమించుకుంటున్నారా? లేక ఒకరి ప్రేమ కోసం మరొకరు తన ఇష్టాలను చంపుకుంటూ సర్దుకుపోతున్నారా?అలా ఒకరు సర్దుకుపోతుంటే ఆ ప్రేమ అలాగే ఉంటుందా?వారు పెళ్ళి చేసుకున్నా సంతోషంగా జీవించగలరా? 

కాదని తెలిసినప్పుడు ఆమె ప్రేమ వద్దనుకుంటే ఎటువంటి పరిణామాలు ఎదురవుతాయి?ఆ సమస్యలు, వేదన ఒక్కరివేనా లేదా ఇరు కుటుంబాలు కూడా వారి విఫల ప్రేమతో బాధ పడక తప్పదా?దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఇలాంటి చక్కటి పాయింట్స్ తీసుకొని వాటిని ‘ది గర్ల్ ఫ్రెండ్’గా మలిచి మన ముందుకి తెస్తున్నారు. 

ఈ సినిమాకు కధ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: రాహుల్ రవీంద్రన్, సంగీతం: హేషమ్ అబ్దుల్ వాహబ్, కెమెరా: కృష్ణన్ వసంత్, ఎడిటింగ్: చోట కే ప్రసాద్ చేశారు. 

గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై విద్యా కొప్పినీడి, ధీరజ్ మొగిలినేని కలిసి ఈ సినిమాని తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషలలొ పాన్ ఇండియా మూవీగా నిర్మించిన ఈ సినిమా నవంబర్‌ 7న విడుదల కాబోతోంది.


Related Post

సినిమా స‌మీక్ష